తెలంగాణ ప్రభ (కోరుట్ల) బీడీ కార్మిక సంఘమునకు చెందిన ఖాళీ స్థలంలో మున్సిపల్ సిబ్బందితో బేస్మెంట్ గోడను కూల్చిన అవార్డు కౌన్సిలర్ పై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు బుధవారం రోజున సిపిఐ మరియు బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి కోరుట్ల సబ్ కలెక్టర్ కు మరియు మున్సిపల్ కమిషనర్ తిరుపతికి వినతి పత్రం అందజేశారు
తదుపరి సిపిఐ నేతలు మాట్లాడుతూ 1976 సంవత్సరంలో సిపిఐ నేత బీడీ కార్మిక సంఘం జాతీయ నాయకుడు గారి ఆధ్వర్యంలో సర్వేనెంబర్ 1571 కోరుట్ల లో ఏడు గంటల స్థలాన్ని పార్టీ ప్రజా కార్మిక సంఘాల అవసరాల నిమిత్తం ఖరీద్ చేసినారు అట్టి స్థలం ఇప్పటివరకు పార్టీ ఆధీనంలో ఉంది అచ్చట పార్టీ జెండా గద్దె నిర్మించి మేడే కార్మిక ఉత్సవాలు కార్యక్రమాలు జరుపుతున్నాం
ఆ స్థలము అన్యాక్రాంతం అవుతున్న దృష్ట్యా స్థలాన్ని కాపాడుటకు పడమర రోడ్డు దక్షిణ రోడ్డు కిరువైపులా సిమెంటు రోడ్డు డ్రైనేజీ వెనుక ఆనుకొని ఉన్న సొంత స్థలంలో తాత్కాలికంగా బండరాయితో బేస్మెంట్ నిర్మించడం జరిగింది.
ఈ విషయం స్థానిక మున్సిపల్ కమిషనర్ కు కూడా పూర్తి వివరాలు తెలపడం జరిగింది
ఈనెల 24 జూన్ 20 24 సోమవారం రోజున ఎలాంటి నోటీసు లేకుండా పార్టీ నేతలను సంప్రదించకుండా ఆ వార్డు కౌన్సిలర్ తప్పుడు సమాచారంతో మున్సిపల్ సిబ్బంది కూల్చివేసినారు తప్పుడు సమాచారం ఇచ్చిన వార్డు కౌన్సిలర్ ప్తే, మున్సిపల్ సిబ్బందిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకొని జరిగిన దానికి నష్టపరిహారం చెల్లించాలని లేదా ఆ బేస్మెంట్ నిర్మాణం చేసి ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వెన్న సురేష్, చెన్న విశ్వనాథం, ములుగురి హనుమంతు, బీడీ కార్మిక సంఘం జిల్లా నేతలు సుతారి రాములు, శ్రీ గాద దేవదాస్, వెన్న మహేష్, ఉస్మాన్ బీడీ కార్మికులు పాల్గొన్నారు
.