ఘనంగా కార్మిక నాయకుడు రవి సింగ్ జన్మదిన వేడుకలు

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) బిఆర్ఎస్ కెవి రాష్ట్ర నాయకులు రవి సింగ్ జన్మదిన వేడుకలు మంగళవారం పాపిరెడ్డి నగర్ తన ఆఫీసులో అభిమానుల మధ్యలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజులలో కూడా మీ ఆదరభిమానాలు నాపై ఇలాగే కొనసాగాలని అన్నారు. ఆ దేవుడు ఆశించిన తో ముందు ముందు కార్మికులకు అండగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటానని  కార్మికులకు ఎలాంటి ఆపద వచ్చినా ముందుండి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస చారి, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

.