తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): గాజులరామారం ప్రభుత్వ పాఠశాలలో మెక్కాన్ గూడా శ్రీశైలం యాదవ్ తమ్ముడు కిట్టు జ్ఞాపకార్థంగా ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్యార్థులందరికీ నోట్ బుక్స్ ను కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిట్టు యాదవ్ జ్ఞాపకార్ధంగా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆదర్శమని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని శ్రీశైలం యాదవ్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్ సంజీవరెడ్డి, సంతోష్ ముదిరాజ్, జగన్, అమీర్, సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, పాఠశాల ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
