తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని దామర చెరువు తూము మరమ్మత్తు పనులు తెల్ల రవి యువసేన చేయూతనందించింది, చెరువు తూము మరమ్మతులకు నోచుకోక సైడ్ వాల్ పరిస్థితి అద్వానంగా మారి నీరు లీకేజీ అవుతుందని మరమ్మతులు చేపట్టాలని రైతులు ఆర్డీవో రాజేశ్వర్ కు ఇరిగేషన్ అధికారులకు కొద్ది నెలల క్రితం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిధులు లేవని అధికారులు చెరువు మరమ్మతు పనులను చేపట్టకపోవడంతో రైతుల కోరిక మేరకు తేల రవి యువసేన ఆధ్వర్యంలో మరమ్మత్తు పనులను చేపట్టడం జరిగింది. మరమ్మత్తులకు కావాల్సిన ఇసుక కంకర ఇతర మెటీరియల్ అందించి మరమ్మత్తు పనులను పూర్తి చేయడం జరిగింది. రైతుల కోసం పనులు చేసేందుకు ముందుకు వచ్చిన తెల్ల రవి యువసేన నిర్వాహకులు రవికుమార్ ను రైతులు అభినందించారు. వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో చెరువు మరమ్మత్తు పనులు తప్పనిసరి కావడంతో సకాలంలో స్పందించిన యువసేన సభ్యులకు దామర చెరువు కింద ఉన్న రైతులందరూ ధన్యవాదాలు తెలిపారు.
