మానవత్వమే ఆయన మార్గం
కార్మిక సంక్షేమమే ఆయన లక్ష్యం
అక్రమార్కుల పాలిట సింహ స్వప్నం
దీన జనులకు ఆపన్న హస్తం
తెలంగాణ ప్రభ, (కుత్బుల్లాపూర్): మనుషులు మర యంత్రాల్లా బతికే హైదరాబాద్ మహా నగరంలో పారిశ్రామిక వాడల్లో పని చేసేందుకు ఎందరో కార్మికులు వలస జీవుల్లా నగరానికి వస్తుంటారు.కాలుష్య కోరల్లో, ఊపిరి సలపని విష వాయువుల మధ్య పనిచేస్తూ ప్రమాదాల బారిన పడి ఊపిరి ఆగిన ఎందరో అబాగ్యుల కుటుంబాలు దిక్కు తోచని దీన స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంటారు.ఆపద సమయంలో అయినవారే మొకం చాటేసే ఈ రోజుల్లో ఆ నాయకుడు ఆపదలో వున్న కార్మికులకు కొండంత అండగా ఉండి ఆదుకుంటాడు. దీన జన బాంధవుడిగా, కార్మిక సంక్షేమే ధ్యేయంగా కార్మిక వర్గాలకు కొండంత అండగా ఉంటాడు.కాలుష్య కర్మాగారాలలో పనిచేస్తూ ప్రమాదాల బారిన పడే శ్రమ జీవులకు పెద్ద దిక్కుగా ఉండి భరోసా ఇస్తాడు.మానవత్వానికి మారుపేరుగా నిలిచే కార్మిక నాయకుడు రవి సింగ్ జన్మదినం సందర్బంగా తెలంగాణ ప్రభ కథనం.
అసమానం అయన సేవలు: ఒకనాడు సామాన్య కార్మికుడిగా పనిచేసిన రవిసింగ్ కార్మికుల కష్టం తెలిసినవాడు. శ్రమ విలువ తెలిసిన ఆయన పారిశ్రామిక వాడల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి జీవన గమనం పై పూర్తి స్థాయి అవగాహన వున్న నాయకుడు.ఒకనాడు శ్రమ జీవిగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఆయన నేడు కార్మిక నాయకుడిగా,బిఆర్ఎస్ కే వి రాష్ట్ర నేతగా కార్మికుల కుటుంబాలకు కష్ట కాలంలో అండగా ఉంటున్నాడు.పారిశ్రామిక వాడగా పేరొందిన జీడిమెట్ల తో పాటు బాలానగర్,రంగారెడ్డి నగర్ కూకట్పల్లి ప్రశాంత్ నగర్, మియాపూర్, బొల్లారం తో పాటు హైదరాబాద్ నగరం లో ఏ ప్రాంతంలో కార్మికులకు ఆపద వచ్చినా తక్షణమే ఆ ప్రాంతానికి వెళ్లి ప్రమాదం లో వున్న కార్మికులకు అండగా నిలబడతాడు.
అక్రమార్కుల పాలిట సింహాస్వప్నం: కార్మికులకు అన్యాయం జరిగితే సాహించేది లేదని చెప్పే రవిసింగ్ వారి హక్కులను కాపాడేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడు.కార్మిక చట్టాల అమలు కోసం అనేక పోరాటాలు చేసాడు.పలు కంపెనీలలో పనిచేసే కార్మికులకు యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకున్నా,కార్మికులను ఇబ్బందులకు గురి చేసినా ఆ యాజమానన్యాల పై కార్మికులను కూడగట్టి పోరాటం చేస్తాడు. యాజమాన్యాలు దిగి వచ్చి కార్మికులకు న్యాయం చేసే వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా పోరుబాట కొనసాగిస్తాడు. ప్రమాదాల బారిన పడిన కార్మికులకు వైద్య సేవలు అందేలా చూసి భరోసా ఇస్తాడు. ప్రమాదవషాత్తు కంపెనీలలో పనిచేస్తూ చనిపోయిన బాధిత కుటుంబాలకు యాజమాన్యాల నుండి నష్ట పరిహారం అందేలా కృషి చేస్తాడు.ఒక్కో సందర్భంలో ఒక్క కార్మికుడి కుటుంబానికి 20 లక్షలకు పైగా నష్ట పరిహారం ఇప్పించడంటే కార్మికుల పట్ల రవిసింగ్ గు వున్న నిబద్దత ఉదాహరణ గా చెప్పవచ్చు. ఎల్లలు లేకుండా సరి హద్దులు చేరిపేస్తూ ఎక్కడ కార్మికులు ఆపదలో ఉంటే తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లి ఆదుకుని అండగా ఉంటాడు. ఏ యాజమాన్యం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందో ఆ యాజమాన్యాల భరతం పట్టి కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తాడు.ఇలా నిరంతరం కార్మికుల సంక్షేమమే పరమావదిగా పనిచేసే రవిసింగ్ సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రమ శక్తి అవార్డు ఇచ్చి గౌరవించింది. తమ బతుకుల్లో వెలుగులు నింపడం కోసం, తమ హక్కుల సాధన కోసం పాటుపడుతున్న రవిసింగ్ జన్మదినం అంటే కార్మికుల వర్గాలకు పండగ రోజే..
.