కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జువ్వాడి నర్సింగరావు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆస్పత్రిలో ఎంతమంది సిబ్బంది ఉన్నారో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఎంతమంది డాక్టర్లు, సిబ్బంది కావాలని అడిగారు. 

ఆసుపత్రి పూర్తిస్థాయిలో కానందున కాంట్రాక్టర్ తో మాట్లాడి త్వరగా పూర్తి చేయాలని కోరారు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి ఆసుపత్రికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు అనంతరం వెటర్నరీ కళాశాలను సందర్శించి కళాశాలలో ఎంతమంది వైద్యులు ఉన్నారో, మౌలిక వసతులు అవసరం ఉన్నాయో, వైద్య సిబ్బంది అవసరం ఉందా అని కళాశాల డీన్ డాక్టర్ శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్న జువ్వాడి నర్సింగరావు ఏమైనా అవసరాలు ఉంటే తనను సంప్రదిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను త్వరగా పరిష్కరిస్తానని తెలిపారు 

ఈకార్యక్రమంలో ఆస్పత్రి సూపరెండెంట్ డాక్టర్ సునీత, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నయీమ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మచ్చ కవిత, కౌన్సిలర్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వసీం, మ్యాకల నర్సయ్య,  కౌన్సిలర్లు ఏంబేరి నాగభూషణం, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, గుండోజి శ్రీనివాస్, నాయకులు శీలం వేణుగోపాల్, ఆడేపు మధు, ఏలేటి మహిపాల్ రెడ్డి,  గడ్డం వెంకటేష్ , పోతుగంటి శంకర్ గౌడ్,  ముత్యాల గంగాధర్, జక్కుల ప్రసాద్, రియాజ్,  బురుగు రామస్వామి గౌడ్, తునికి సాయి గణేష్, గంగాదరి రమేష్, గంగాదరి సతీష్,  గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

.