తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరి ..బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు.,
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
కాగా జూబ్లీహిల్స్‌లోని సిఎం నివాసంలో ఎమ్మెల్యే డా. సంజయ్‌కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన సీఎం రేవంత్ రెడ్డి..?
రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్‌ను కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ స్టార్ట్ చేసినట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల గ్యాప్‌లోనే పోచారం శ్రీనివాసరెడ్డి , డా.సంజయ్ .. ఇద్దరు ఎమ్మెల్యేలను చేజార్చుకున్న బీఆర్ఎస్ కు నెక్ట్స్ ఎవరు వెళ్తారోనని టెన్షన్ పట్టుకుంది.
.