తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): దుండిగల్, సారెగూడెం లోని ఆల్కాలిక్ మెటల్స్ కంపెనీ లో సోమవారం జరిగిన యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం బిఆర్ఎస్ కెవి అభ్యర్థి మల్లేష్ పై ఎన్ టి యు సి తరపున అధ్యక్షుడిగా ఫోటి చేసిన ఎం.రాము గౌడ్ ఘన విజయం సాధించారు.
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్,మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి కంపెనీ సలహాదారులుగా ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా శంకర్ తో పాటు పలువురు సభ్యులుగా రాము గౌడ్ ప్యానెల్ ఘన విజయాన్ని సాధించారు.
ఈ సందర్భంగా గౌడ్ మాట్లాడుతూ తమ విజయానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి కి, కంపెనీ ఉద్యోగులకు, గ్రామ పెద్దలందరికీ రాము గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.
ఘన విజయం సాధించిన రాము గౌడ్ ప్యానల్ కి పలువురు శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదగిరి , కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి , ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు సదానందం, గ్రామ పెద్దలు, కంపెనీ ఉద్యోగులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
.