తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): గాజులరామారం డివిజన్ పరిధిలోని మిథాలీ నగర్ శ్రీ విజయదుర్గాంబిక ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదుర్గంబిక అమ్మవారి ఆశీస్సులు కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మనసారా వేడుకున్నానని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంజీవరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
