తల్లిదండ్రులను విస్మరించేవారు శిక్షార్హులే. - కలెక్టర్ సత్య ప్రసాద్

తెలంగాణ ప్రభ, (జగిత్యాల): వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని,వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని జిల్లా  కలెక్టర్ బుడిమజ్జి  సత్య ప్రసాద్ అన్నారు.

కలెక్టర్ చాంబర్ లో తెలంగాణ అల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా పదవీభాద్యతలు స్వీకరించిన  కలెక్టర్  సత్య ప్రసాద్ ను జిల్లా సీనియర్ సిటిజన్స్ ప్రతినిధులు కలిసి స్వాగతిస్తు పుష్పగుచ్చాలు అందించి పట్టు శాలువాలతో సన్మానించి మేమొంటో అందజేశారు..

అనంతరం  అసోసియేషన్ ముద్రించిన సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రచార పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు.

తమ అసోసియేషన్ ముద్రించిన సిటిజన్స్ చట్టం అవగాహన పిలుపు పుస్తకాన్ని హరి ఆశోక్ కుమార్ అందజేశారు.  తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని , ప్రభుత్వం తరపున నిర్మిస్తున్న వృద్ధాశ్రమం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కోరగా తగు చర్యలు తీసుకుంటామని   కలెక్టర్ చెప్పారు. 

ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,సీనియర్ సిటిజన్స్ జిల్లా  ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత రెడ్డి ,ఎం. డి.యాకూబ్, కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,,నాయకులు  దిండిగాల విఠల్,సతీశ్ రాజ్, గంగాధర్, కరుణ,  ,జగిత్యాల మండల అధ్యక్షుడు బి.రాజేశ్వర్,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,మెట్ పల్లి అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి,సారంగపూర్ మండల అధ్యక్షుడు కాలగిరి గంగ రెడ్డి,ధర్మపురి అధ్యక్షుడు కె.గంగాధర్ ,తదితరులు పాల్గొన్నారు.

.