తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గం నుండి బిజెపి కార్యకర్తలు తరలి వచ్చారు, ముఖ్యఅతిథిగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ కి సన్మానం చేశారు.
అనంతరం ప్రెస్ మీట్ లో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి, రెండోసారి గెలిపించిన మహిళలందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
టిఆర్ఎస్ లో ఉన్న ప్రభుత్వం సీఎం కేసీఆర్ కొంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇండ్లు కట్టించారు, మాజీ సీఎం కెసిఆర్ బిడ్డ కవిత జైల్లోనే ఉన్నది, లిక్కర్ స్కాములో కవిత దోషిగా ఉన్నారు. వస్తదో రాదో తెలియదు అని ఆయన అన్నారు. ఈసారి కూడా నియోజకవర్గం కి ఎన్నో పనులు చేసి చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు డిపార్ట్మెంట్ కానీ సిఐడి ఏ వ్యవస్థ గాని పని కాంగ్రెస్ ప్రభుత్వంతోని పనిచేస్తుంది.
సమాజానికి రెండు చీడపురుగుల పార్టీ ఒకటి టిఆర్ఎస్, రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో కూడా బిజెపి బలోపేతం చేస్తుంది. నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాలో 9 లక్షలు మెజారిటీ వచ్చింది అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదు, కొంతమంది ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టే పైసలు మొత్తం ప్రజానీకి ఉపయోగించాలని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు రెండు లక్షల రుణమాఫీ అవన్నీ అబద్ధమని ఆయన తోసిపుచ్చారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఏమి నెరవేర్చలేదని, ప్రజలకు ఉపయోగపడే పని చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. 2019 నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేశారా, ప్రజలకు ఉపయోగం పడే ఎలాంటి పనిచేయలేదు. పసుపు బోర్డు తీసుకురావడానికి, ఇప్పుడు 500 పడకల ఆసుపత్రిని కూడా సిద్ధంగా ఉంచామని.బీజేపీకి ఎవరు ఎక్కువ బలంగా నిలబడుతారో వారికే నాయకత్వ అవకాశం, రాజకీయంగా ఎదగగలుగుతారు.
కేంద్రం నుండి వచ్చిన నిధుల వివరాలను ఫ్లెక్సీల రూపంలో ప్రజలకు తెలియజేయాలి,
నాయకులు ఇచ్చిన సలహాలను పాటిస్తా. ఎన్నికల కోడ్ రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని చర్యలు తీసుకోవాలి, ఎన్నికల పనుల్లో నాయకులంతా సంసిద్దంగా ఉండాలి. ఎలాంటి సలహాలు కావాలన్నా నన్ను కలవొచ్చు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ చేసిందా, కానీ 2018కంటే ముందు రుణాల గూర్చి చర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు.
శాలువాలు, బొకేలు వద్దు వాటికి బదులుగా నోట్ బుక్స్ ఇస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలలకు అందజేస్తాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో జడ్పిటిసి, ఎంపిటిసి గాని, మున్సిపల్ చైర్ పర్సన్ కానీ కైవసం చేసుకోవాలని బిజెపి కార్యకర్తలకు ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, డాక్టర్ శ్రీమతి బోగ శ్రావణి, బిజెపి నాయకులు, మల్లాపూర్ & ఇబ్రహీంపట్నం, కోరుట్ల మండలాల నుండి బిజెపి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
.