బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో బోర్లను ప్రారంభించిన కొలను హనుమంత్ రెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ లక్ష్మీ నగర్ కాలనీలో నీటి సమస్య తీర్చేందుకు వేసిన బోర్లను శుక్రవారం కొలను హనుమంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇందిరమ్మ కాలనీ లక్ష్మీ నగర్ ప్రాంతవాసులు తన దగ్గరికి వచ్చి మాకు నీటి సమస్య బాగా ఉందని హనుమంత్ రెడ్డి దృష్టి కి తీసుకురాగా వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడి సీఎం సహాయ నిధి నిధుల స్పెషల్ డెవలప్మెంట్ ద్వారా ఐదు లక్షలు మంజూరు చేయించి నీటి సమస్యను తీర్చమని అన్నారు తమ నీటి సమస్యను తీర్చినందుకు కాలనీవాసులంతా కొలను హనుమంతు రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జాయింట్ సెక్రటరీ పోలీస్ జితేందర్ రెడ్డి, మల్లారెడ్డి, 13 వ వార్డు కౌన్సిలర్ నర్సారెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ చైర్మన్ సాల్మన్ రాజు, దళిత సంఘాల నాయకులు నారాయణ,  సంజీవరెడ్డి, శివ, నర్సింగరావు, రాజు ,వెంకటేష్ ,షరీఫ్, గౌస్ భాయ్, నయీమ్, మహిళా నాయకులు మధులత, కమలమ్మ, తదితరులు పాల్గొన్నారు.

.