తెలంగాణ ప్రభ (కోరుట్ల): అంతర్జాతీయ యోగా దినోత్సవ" సందర్భంగా జగిత్యాల పట్టణంలోని స్థానిక గీతా విద్యాలయంలో నిర్వహించిన యోగా డే సెలబ్రేషన్ లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం డాక్టర్.బోగ శ్రావణి
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...
యోగా.. మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి భాగమై పోయింది. యోగాసనాల ప్రాధాన్యతని బట్టి మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న నిర్వహించారు.
ఆ వేడుకల్లో 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు మొత్తం 35,985 మంది యోగా చేసి రెండు గిన్నిస్ రికార్డులని నెలకొల్పారు.
అప్పట్నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇలా ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
యోగా అనేది మన జీవితంలో భాగమైతే కచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాం. పురాతన కాలం నుంచి యోగాని ఆచరించేవారు. ఈ యోగాసనాలు గొప్పదనం తెలుసు కాబట్టే, విదేశీయులు సైతం యోగాసనాలను ఆచరిస్తున్నారు.
రెగ్యులర్‌గా ఆసనాలు వేయడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. బాడీ ఫ్లెక్సిబిల్‌గా ఉంటుంది. దీంతో పాటు యోగాని మన జీవితంలో భాగం చేసుకుంటే ఒత్తిడి, ఆందోళనలను తగ్గుతాయి. మనకి వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకి యోగాలో పరిష్కారాలు ఉన్నాయి. ఎంతో మంది వీటి గొప్పదనం తెలుసు కాబట్టే రోజూ యోగాసనాలు వేస్తున్నారు. దీంతో యోగా ఖ్యాతీ ప్రపంచంలోని నలుదిక్కులకి పాకింది.
సూర్యనమస్కారాల యోగాలో ముఖ్యమైన ఆసనం. ఈ సూర్య నమస్కారాలు 12 ఆసనాల కలయికగా ఉంటుంది. దీనిని చేయడం వల్ల చాలా వరకూ బెనిఫిట్స్ ఉంటాయి. యోగాని చేయడం వల్ల మనసుకి, శరీరానికి ప్రశాంతత ఉంటుంది. మొదట్లో ఎంతో ప్రాచూర్యం పొందిన యోగా మధ్యలో కొన్ని రోజులు దాని ప్రభావం తగ్గింది. అయితే, యోగాసనాల ప్రయోజనాల కారణంగా పెరిగిన అవగాహనతో నేడు మళ్ళీ యోగాకి పూర్వ వైభవం వచ్చింది. దీంతో పాటు ప్రతి ఒక్కరూ యోగాని తమ జీవనంలో భాగం చేసుకుంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే, యోగాకి ప్రత్యేకంగా ఓ రోజుని అంకితం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అనుమల్ల కృష్ణహరి,జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొక్కు గంగాధర్, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సిరికొండ రాజన్న, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, ఉపాధ్యక్షులు పవన్ సింగ్, గదాసు రాజేందర్, మ్యాదరి అశోక్, రాపర్తి రాజ్ కుమార్, మామిడాల రాజగోపాల్, గడ్డల లక్ష్మి, సింగం పద్మ, మామిడాల కవిత మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.