ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విచ్చలవిడిగా పుస్తకాలు అమ్ముతున్న కోరుట్ల ప్రైవేట్ పాఠశాలలు - ఏబీవీపీ కోరుట్ల నగర కార్యదర్శి మడవేణి సునీల్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): తెలంగాణ రాష్ట్రంలో  ప్రభుత్వం మారింది గాని పరిపాలన విధానం మారలేదు అలాగే అధికారం మారింది గానీ అధికారుల తీరు మారలేదు మద్యంపై వచ్చే ఆదాయం  మీద ఉన్న ధ్యాస విద్యార్థుల భవిష్యత్తుపై లేకపోవడం పాఠశాలను విచ్చలవిడిగా వారికి నచ్చినట్లు పుస్తకాలు అమ్ముకుంటూ సరియైన అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాల లు  నడిపిస్తున్న పట్టించుకునే సంబంధిత నాయకులు అధికారులు లేకపోవడం శోచనీయమని ఏబీవీపీ నగర కార్యదర్శి మాడవేని సునీల్ విమర్శించారు. 

గురువారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ  రాష్ట్ర భవిష్యత్తు అయినా దేశ భవిష్యత్తు అయినా నిర్మాణం చేసేటటువంటి విద్యారంగం మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేకుండా పోయిందని విద్యాసంస్థలు మొదలై సుమారుగా 10 రోజులు కావస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు అత్యాధిక ఫీజులు వసూలు చేస్తూ, అనుమతులు లేకున్నా విద్యాసంస్థలను నిర్వహిస్తూన్నారు 

అలాగే  ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విచ్చలవిడిగా పుస్తకాలు అమ్ముతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్ర విడాడం లేదు ఈరోజు బ్రాండ్ల పేరుతోటి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అమ్ముతూ సిలబస్ కాకుండా వేరే పుస్తకాలను కొంటె మీకు విద్యను ఎవరు చెప్తారు అవి మా పాఠశాలలో చెల్లవు అంటూ బెదిరిస్తున్నారు యాజమాన్యాలు అలాగే  విద్యాసంస్థలన్ని విద్యా కేంద్రాలుగా ఉండాల్సిన విషయం మరిచి ప్రభుత్వ పాలకుల ప్రోత్సాహంతో వ్యాపార కేంద్రంగా మారిపోయాయి 

అలాగే నూతనంగా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలకు పైగా కావస్తున్న ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగం గురించి మాట్లాడిన పాపాన పోలేదని ఈ యొక్క రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి కరువైపోయారనీ మద్యంపై వచ్చే ఆదాయంపై ఉన్న ధ్యాస విద్యార్థుల బంగారు భవిష్యత్తు విద్య గురించి ఆలోచించే నాథుడే కరువయ్యాలని విమర్శించారు. 

రాష్ట్రంలో విద్యార్థులను కూడా విడదీసి మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం ప్రభుత్వం చేస్తున్న ఇట్టి దురాగతాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, ఇలాంటి వింత పోకడలు సభ్య సమాజంలో తగవని ఇప్పటికైనా తక్షణమే విద్యార్థులు అందరినీ ఒకే కోణంలో చూసి అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అందజేయాలని డిమాండ్ చేశారు.  

ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేసే విధంగా సరైన పద్ధతిలో నడిపే విధంగా స్పెషల్ కమిటీని వేసి ఉద్యమంలా నిర్వహించి ఇట్టి పరిస్థితులలో చక్కదిద్దాలని లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందజేసి సమస్య పరిష్కరించే వరకు పోరాడుతామని ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీలని అరికట్టాలని డిమాండ్ చేశారు.

.