తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల పట్టణంలోని 23వ వార్డు ఏస్కొని గుట్ట అంగన్వాడి కేంద్రంలో జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రెండు దశలుగా ఆరు నెలలకు ఒకసారి ఒక సంవత్సరం పిల్లల నుండి 19 సంవత్సరాల వరకు ఈ మాత్రలు వెయ్యడం జరుగుతుందని ప్రతి బిడ్డకు వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, కలుషితమైన ఆహారం, జంక్ ఫుడ్ తినడం వంటి వివిధ కారణాలవల్ల పిల్లల్లో వర్మ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని తెలియజేయడం జరిగింది. పిల్లల శరీరంలో రక్తహీనత బారిన పడకుండా తల్లి,దండ్రులకు అవగాహన కలిగించి, పిల్లలకు మాత్రలు వేయడం జరిగింది.
ఈరోజు అందుబాటులో లేని పిల్లలకి మళ్లీ 27 తేదీ గురువారం రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆరోజు తప్పనిసరిగా పిల్లలకు వారి తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రంలో మాత్రలు వేయించాలని వైద్య సిబ్బంది తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పుప్పాల ఉమాదేవి ప్రభాకర్, డాక్టర్ రాధా రాణి RBSK, డాక్టర్ రమ్య MLHP, ఫార్మా సిస్టర్ భార్గవి, నిరోష , నాగరాణి, ఆశ నాగమణి, అంగన్వాడి టీచర్ బి.రజిత, ఆయా పర్వీన్ వార్డులో పిల్లల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
.