వయోవృద్ధులపై వేధింపుల నివారణకు అవగాహన సదస్సు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్  కోరుట్ల డివిజన్   శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ  వయోవృద్ధులపై వేధింపుల నివారణకు అవగాహన వారోత్సవాల్లో భాగంగా వృద్ధుల రక్షణ,పోషణ సంక్షేమ చట్టంపై  సీనియర్  సిటిజెన్ల,పెన్షనర్ల ,వివిద సంఘాల  ప్రతినిధులకు  రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్  అవగాహన కల్పించారు.

గురువారం తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్  కోరుట్ల డివిజన్  కార్యాలయం సమావేశ మందిరంలో డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం అధ్యక్షతన  జరిగిన ఈ అవగాహన  సదస్సులో వయోధికులపై వేధింపుల నివారణకు జిల్లా  సీనియర్ సిటీజేన్స్  అసోసియేషన్ ముద్రించిన తల్లిదండ్రులు,వయో వృద్ధుల పోషణ,సంక్షేమ చట్టం 2007 నియమావళి 2011 తో కూడిన  అవగాహన కరపత్రాలు,స్టిక్కర్లను రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం నిరాదరణకు గురవుతున్న వయోధికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కొందరు కొడుకులు,కోడళ్లకు హరి ఆశోక్ కుమార్,  కోరుట్ల డివిజన్ కౌన్సెలింగ్ అధికారులు శివానందం,రాజ్ మోహన్,లక్ష్మీనారాయణ లు   లు కౌన్సెలింగ్ తో  పరిష్కరించారు. సీనియర్ సిటీజేన్స్ కు అండగా ఉంటూ ఆర్డీవోలకు ఫిర్యాదులు అందజేస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న సీనియర్ సిటీజేన్స్ సంఘాల,డివిజన్,మండల,గ్రామ ప్రతినిధులైన 26 మందిని  హరి ఆశోక్ కుమార్ చేతుల మీదుగా  టాస్కా మెమోంటోలు అందజేసి  సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,జిల్లా ఉపాధ్యక్షుడు  ఎం.డి.యాకూబ్, కోశాధికారి వెలుముల ప్రకాష్ రావు,కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు  పబ్బా శివానందం, కార్యదర్శి జీ.రాజ్ మోహన్, కోశాధికారి నల్ల  లక్ష్మీ నారాయణ, ఉపాధ్యక్షుడు ఎం.డి. సైఫోద్దీన్,సాబితలి, ఏన్నం గంగాధర్, అబ్దుల్ గఫార్, దర్శనాల ఆనంద్ ,రాజయ్య, యువజన జెఎసి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దోనూరి భూమాచారి,కోరుట్ల డివిజన్,మండల,గ్రామాల  సీనియర్ సిటీజేన్స్  ప్రతినిధులు పాల్గొన్నారు.

.