తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ ప్రభుత్వ పాఠశాలలో డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ బుధవారం పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, బిఆర్ఎస్ యువజన నాయకుడు కొలుకుల జైహింద్, మల్లేష్ గౌడ్, పాపులు గౌడ్, బ్రహ్మచారి, అజాం, పాపిరెడ్డి, జగన్ ముదిరాజ్, విటల్ ముదిరాజ్, దాసు, ప్రభాకర్, ఖలీల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్ నాయక్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
