సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి

నా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ 

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని  నా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గోగులపాటి కృష్ణమోహన్ అభిప్రాయపడ్డారు. 

ఇటీవల సైబర్ నేరాలు హెచ్చు మీరుతున్నాయని, క్షణాల్లో డబ్బులు మాయమైపోతున్నాయని, అమాయక ప్రజలు పెద్ద మొత్తంలో ఆర్ధికంగా నష్టపోతున్నారని గోగులపాటి కృష్ణమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

సైబర్ నేరాలను అరికట్టడం అసాధ్యమని,  ప్రజల్లో అవగాహన పెంపొందించడం, జాగ్రత్తలు పాటించడం ద్వారానే సైబర్ నేరాలను నివారించవచ్చని ఆయన అన్నారు.

అయితే కొన్ని వ్యాపార సంస్థల్లో ముఖ్యంగా  హోటల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్, పబ్స్, రెస్టారెంట్స్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్, షాపింగ్ మాల్స్ లాంటి ప్రధాన వ్యాపార కేంద్రాలలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఉచిత వైఫై అందజేస్తుంటారని, ఇలాంటి చోట్ల నుండి సైబర్ నేరాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని గోగులపాటి కృష్ణమోహన్ పేర్కొన్నారు.

ఇలాంటి ఫ్రీ వైఫై జోన్లలో ఓకే పాస్వర్డ్ యూసర్ నేమ్ ను ఎక్కువమంది ఉపయోగించడం వలన ఏ పరికరాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారో అని కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉండదని, సైబర్ నేరగాల్లను త్వరితగతిన గుర్తించడానికి అవకాశం ఉండదని కృష్ణమోహన్ తెలిపారు.

ఇలాంటి ఫ్రీ వైఫై అందజేసే వ్యాపార సంస్థలు ఐకాన్ వేవ్, ఐకాన్ వైఫై లాంటి  బ్యాండ్ విడ్త్ మేనేజ్మెంట్ సేఫ్టీ అప్లికేషన్లను  ఉపయోగించినట్టయితే  ప్రతి యూజర్కు అతేంటికేషన్, ఆతరైజేషన్, ఎకౌంటబిలిటీ   ఉంటుందని, దాని ద్వారా నేరాలు జరిగినప్పుడు వెంటనే గుర్తించే అవకాశం, కాల్ లాగ్స్ స్టోరేజ్ మొదలగు సదుపాయాలు ఉంటాయని, సైబర్ పోలీసులు కూడా సైబర్ నేరగాళ్ళను తొందరగా గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా అపరిచితుల ఫోన్ కాల్స్ ను ఎత్తకపోవడం, అపరిచితులకు అకౌంట్ వివరాలు చెప్పకపోవడం, సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లింకుల జోలికి వెళ్లకపోవడం లాంటి జాగ్రత్తలు పాటిస్తే సైబర్ నేరాల భారిన పడకుండా ఉంటామని ఆయన అన్నారు.

సైబర్ నేరాలకు నియంత్రించలేకున్నా, వాటిపట్ల ప్రజలను జాగృతం చేసినట్లయితే వాటి బారిన పడకుండా కాపాడుకునేలా చేయాలని వెల్లడించారు.

.