సమస్య ఉందని వస్తే వెంటనే పరిష్కరిస్తున్న ప్రజా నాయకుడు కొలను
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణేష్ నగర్ చెందిన రవికుమార్ కుమార్తె ప్రస్తుతి గత కొన్నిరోజులుగా టర్నర్ సిండ్రోమ్ అనారోగ్యంతో బాధపడుతు నిజాం హాస్పిటల్ లో చికిత్స పొందుటకు ఆర్ధిక స్థోమత లేకపోవటంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితురాలి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,10,000/- ల సీఎం సహాయనిధి - ఎల్వోసీ ని మంజూరి చేయించారు. రూ.2,10,000/- (రెండు లక్షల పది వేల రూపాయలు) సీఎంఆర్ఎఫ్ ఎల్ వో సి మంజూరి పత్రాలను రవికుమార్ కుటుంబ సభ్యులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బి - బ్లాక్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ మున్సిపల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి సీనియర్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, గడ్డం రాజేందర్ రెడ్డి, గణేష్, నర్సింగ్ రావు, ప్రసన్న కుమార్, నరేష్, అమీర్ అలీ, స్వాతి, శ్రీలత ముదిరాజ్, ఫారీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు .
.