తెలంగాణ సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ మహానంది అవార్డు పొందిన తోడేటి సత్యం ముదిరాజ్ సన్మానించిన కోలా రవీందర్ ముదిరాజ్
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) ఇటీవల అనుమకొండ లో జరిగిన తెలుగు సాహితి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్ జాతీయ నంది పురస్కారం పొందిన తోడేటీ సత్యం ముదిరాజును సన్మానించిన పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజుల ఐక్యత కోసం జాతి అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి సత్యం ముదిరాజ్ అని అన్నారు. ఆయనకు ఆయనకు తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్ జాతీయ నంది పురస్కారం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముదిరాజు జాతికి సంబంధించిన ఒక వ్యక్తి ఇంతటి స్థాయికి ఎదగడం ఉన్న ఊరికి కన్నతల్లికి జాతికి అభివృద్ధి తోడ్పడే వ్యక్తులు ఉన్నత స్థాయికి ఎదగాలని మన జాతికి కూడా ఎంతో విలువ నిచ్చే అంశమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి, శ్రీను ముదిరాజ్, విగ్నేష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
