ఈ సంవత్సరపు ఉత్తమ సీనియర్ తైక్వాండో కోచ్ గా జగిత్యాల జిల్లా కోరుట్ల కి చెందిన నావనంది రమేష్ ఎంపిక

తెలంగాణ ప్రభ (కోరుట్ల): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ లో ఆదివారం రోజున జరిగిన కోచేస్ అభినందన సభలో జగిత్యాల జిల్లా కోరుట్లకి చెందిన మాస్టర్ తైక్వాండో క్లబ్  ఫౌండర్, నేషనల్ కోచ్ ,నేషనల్ రిఫరీ అయిన నావనంది రమేష్ కు ఈ సంవత్సర ఉత్తమ సీనియర్ కోచ్ గా అభినందన సర్టిఫికేట్ ని తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీ కురువ శ్రీహరి, ప్రెసిడెంట్ శ్రీ ముఠా శ్రీనివాస్ గార్ల చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ట్రెజరర్ జి సంతోష్ కుమార్, కరీంనగర్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి రాజేందర్, కోచ్ సోయబ్ లు ,తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల తైక్వాండో కోచ్ లు,ముఖ్య అతిథులు, అన్ని జిల్లాల సెక్రటరీలు,ప్రెసిడెంట్లు పాల్గొనడం జరిగింది.

.