తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి, నారాయణ మల్టీ స్పెషల్ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు ఘనంగా నిర్వహించారు.
లయన్స్ క్లబ్ అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు అధ్యక్షతన రిజిస్ట్రేషన్ జనరల్ చెకప్,డెంటల్ చెక్ అప్,గైనాజికల్,కార్డియాలజీ, క్యాన్సర్ స్కానింగ్ ఉచితంగా డాక్టర్స్ రణధీర్ స్వప్న, నికిత, సస్మాతి, శిరీష అనిరుద్ చే ఉచిత వైద్యం నిర్వహించారు.
ఉచిత మందులు పంపిణీ చేశారు .
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ,డాక్టర్లు మాట్లాడుతూ..లయన్స్ క్లబ్ మెటుపల్లి వారి సహకారంతో పట్టణంలోని గ్రామీణ పట్టణ ప్రజలకు అందుబాటులోకి ఈ ఉచిత క్యాంపు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని లయన్స్ క్లబ్ సేవలు గతంలో విన్నానని చాలా మంచి కార్యక్రమాలు చేశారని పేద విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చలికాలంలో వృద్ధులకు పంపిణీ, ఉచిత కంటి శిబిరాలు ఏర్పాటు చేయడం ఇతర చలివేంద్రాలు ఆర్థిక సహాయ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు,వడ్డేపల్లి శ్రీనివాసన్,ప్రోహార్ తుకారం,గట్ల మారుతి,గడ్డం శంకర్ రెడ్డి గంగుల మురళి ,మహాజన్ శివ కుమార్ ,ఇల్లేందుల వెంకటేష్ కోటగిరి తిరుమల చారి, గంగాధర్ మురళి దశరథం తదితరులు లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు
.