మల్లాపూర్-- హైదరాబాద్ బస్సు నడిపించాల్సిందిగా రవాణా మంత్రి ని కోరిన జువ్వాడి కృష్ణారావు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రం  నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సులు నడిపించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను  సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరారు. 

ఈ మేరకు హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు అనంతరం విలేకరులతోకృష్ణారావు మాట్లాడుతూ  మల్లాపూర్ మండలం నుండి విద్యార్థులు ఉద్యోగులు హైదరాబాద్ లో చదువుకోవడం ఉద్యోగాలు చేయడం ఇతర వ్యాపారాల నిమిత్తం వెళ్తుంటారని, అలాంటి వారికి మల్లాపూర్ నుండి హైదరాబాద్ కు సరైన రవాణా సదుపాయం లేకపోవడం వల్ల  చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, హైదరాబాద్ వెళ్ళాలి అంటే మూడు బస్సులు మార్చాల్సిన పరిస్థితి ఉందని, కాబట్టి కోరుట్ల పట్టణం నుండిబస్సు బయలుదేరి మల్లాపూర్   మండలం రేగుంట మల్లాపూర్ ముత్యంపేట మీదుగా ఆర్మూర్ నుండి ఒక బస్సు బయలుదేరే విధంగా అలాగే మెటుపల్లి పట్టణం నుండి మరో బస్సు బయలుదేరి మల్లాపూర్ మండలం ముత్యంపేట మల్లాపూర్ రేగుంట గ్రామాల మీదుగా రాయికల్ జగిత్యాల ద్వారా హైదరాబాద్ వెళ్లే విధంగా రెండు బస్సులు నడిపించాల్సిందిగా మంత్రి ని కోరారు 

వీటితోపాటు మల్లాపూర్ నుండి మెటుపల్లి వెళ్లే బస్సులు మండలంలోని కుస్తాపూర్ రత్నాపూర్ గ్రామంలో నుండి నడిపించాలని మంత్రిని కోరారు 

ఊరు బయట నుండి బస్సులు వెళ్లడం వల్ల రెండు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు 

దీనికి మంత్రి వెంటనే సానుకూలంగా స్పందించి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశిస్తానని జువ్వాడి కృష్ణారావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు

.