తెలంగాణ ప్రభ (కోరుట్ల): సీనియర్ సిటీజేన్స్ సమాజ మార్గదర్శకులని ,వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని,వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని కోరుట్ల ఆర్డీవో ఎన్.ఆనంద్ కుమార్ అన్నారు.
కోరుట్లలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12 వ ప్రపంచ వయోధికుల, వేధింపుల నివారణ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్డీవో హాజరై మాట్లాడారు. సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ పిలుపు పత్రికలను విడుదల చేశారు.
వయోవృద్ధుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 14567 ఉందని,వారిని నిరాదరిస్తున్న,వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు.వేధింపులకు గురిచేసిన వారికి వయో వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారం 3 నెలల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే వీలుందన్నారు.
డివిజన్ సీనియర్ సిటీజన్స్ అధ్యక్షుడు పబ్బా శివా నందం ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు వయోధికులకు సేవలు అందిస్తున్నారని,ఎవరైనా వయోవృద్ద తల్లిదండ్రులు తమ సమస్యల పరిష్కారం కోసం వారు తోడ్పాటు నిస్తారని, గతంలో డివిజన్ లో పరిష్కారం అయిన కేసులను వివరించారు. అనంతరం సీనియర్ సిటీజన్స్ వెంకటేశ్వర్ ,ఆనంద్ ,రాధ ,చిన్నరాజు లను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం, కార్యదర్శి రాజ్ మోహన్, ఉపాధ్యక్షులు సైఫోద్దీన్ , నల్ల లక్ష్మీ నారాయణ , చిలుక గంగారాం, అల్లూరి బాపూరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.