తెలంగాణ ప్రభ (కోరుట్ల): రాష్ట్రంలో కలెక్టర్ల బదిలీల నేపథ్యంలో షేక్ యాస్మిన్ బాషా ను బదిలీ చేస్తూ, ఆమె స్థానంలో బి. సత్య ప్రసాద్ ను ప్రభుత్వం నియమించింది.
ఆదివారం రోజున IDOC లో బదిలీపై వెళ్తున్న షేక్ యాస్మిన్ బాషా నుండి బాధ్యతలను స్వీకరించారు.
అనంతరం వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కొత్త కలెక్టర్ కు పూల మొక్కలను అందించి శుభాకాంక్షలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) పి.రాంబాబు, రెవిన్యూ డివిజనల్ అధికారులు పి. మధుసూదన్, ఆనంద్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
.