తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండలంలోని జల్లా పల్లి అభాది, జల్లాపల్లి ఫారంలో మాజీ మండల కొప్షన్ మెంబర్ ఏం.ఏ. హకీమ్ 60వ. జన్మదిన వేడుకలను నాయకులు గ్రామస్తులు, యువకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగ్రామమైన జల్లాపల్లి ఫారంలో పార్టీలకు అతీతంగా నాయకులందరూ కలసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామస్తులకు వృద్ధులకు స్వీట్లు పంచి పెట్టారు .ఆయన చేసిన సేవలను మరువలేమని కొనియాడారు. ఆయన గతంలో గ్రామ అభివృద్ధికి అనేక పనులను మంజూరు చేసి గ్రామస్తులు ప్రశంసలు పొందిన వ్యక్తి అని అన్నారు. ఆయన పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందజేస్తూ రంజాన్ పండగ సందర్భంలో ముస్లిం పేద ప్రజలకు రంజాన్ తోప అందజేశారని కొనియాడారు. వారు మాట్లాడుతూ.. ఆయన నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని దీవిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వివేక్, మండల కోప్షన్ మెంబర్ ఇస్మాయిల్, బిఆర్ఎస్ నాయకుడు సేరు, జయరాం, మహమ్మద్ ఖాన్, దేవిసింగ్, బలరాం కోటగిరి కాంగ్రెస్ యువ నాయకుడు వహీద్ ,మైనార్టీ నాయకులు సమీర్, తదితరులు పాల్గొన్నారు.
