శక్తి స్వరూపిణి అమ్మవారిని కొలవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): జగద్గిరిగుట్ట డివిజన్ సీసలబస్తి లోని శ్రీ జైదుర్గ నవదుర్గ ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యేలు వివేకానంద,అరికెపూడి గాంధీ  ముఖ్య అతిథులుగా హాజరై ఆలయంలో చండీ హోమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ శక్తి స్వరూపిణి అయిన జై దుర్గ నవదుర్గ అమ్మవారిని కొలవడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నారు. 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, కొలుకుల జైహింద్, పాపయ్య గౌడ్, విట్టల్ ముదిరాజ్, మెట్ల శీను, దాసు, అజ్రత్ అలీ, సాయిలు యాదవ్, విటల్, మహంకాళి, వెంకటేష్, బ్రహ్మచారి, భోగ రాజేష్, ఆంజనేయులు యాదవ్, రాయి రాజేష్, నరసింహారెడ్డి, నర్సింగ్ గౌడ్, లక్ష్మణ్,  గణేష్, విగ్నేష్, రామరాజు తదితరులు పాల్గొన్నారు.

.