తెలంగాణ ప్రభ (నర్సాపూర్): ఏప్రిల్ నెలలో హత్నూర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగులకు స్లాట్ బుక్ చేయించి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సదరం క్యాంపుకు తీసుకెళ్లిన వారిలో ఈరోజు సిరిపురం గ్రామానికి చెందిన సంగన్న గారి వీర గౌడ్ కు వికలాంగుల ధ్రువపత్రాలను సంగారెడ్డి జిల్లా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు శివశంకర్ రావు అందజేశారు. ఏప్రిల్ నెలలో హత్నూర మండలంలో చేపట్టిన దివ్యాంగుల సదరం క్యాంపు 12 మందికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.
అందులో వివిధ గ్రామాలకు చెందిన 8 మందికి ఈరోజు ఇవ్వడం జరిగిందని అన్నారు. ధృవపత్రాలు పొందిన వారికి పెన్షన్ రావడం వల్ల వారికి ప్రతి నెల నెల మందుల ఖర్చులకోసం ఎవ్వరి పైన ఆధారపడకుండా వారే తెచ్చుకునే సౌలభ్యం లభించిందన్నారు. దివ్యాంగులకు సేవ చేయడం జీవితంలో ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.వారు ఇచ్చే దీవెనలు, ఆశీస్సులు మరింత రెట్టింపుతో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుందని. సిరిపురం మాజీ సర్పంచ్ మచ్చ నరేందర్ మాట్లాడుతూ దివ్యాంగుల కష్టాన్ని చూడలేక శివశంకర్ రావు దృష్టికి తీసుకెళ్లగా వారు దగ్గరుండి సర్టిఫికెట్ ఇప్పించారన్నారు. శివ శంకర్ రావు కు వ్యాంగుల కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మచ్చ నరేందర్, వెంకట్ రెడ్డి, నరోత్తం రెడ్డి నగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
.