తెలంగాణ ప్రభ (కోరుట్ల): దేశంలో, రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి, బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం" జూన్ 6 నుంచి జూన్ 19 వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా గురువారం కోరుట్ల పట్టణంలోని ఎకిన్ పూర్ లో గల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఇట్టి "బడి బాట" కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, నోట్ బుక్స్ ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలలో కన్న ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ప్రశాంతమైన వాతావరణం చక్కని క్రమశిక్షణ అలవడుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ కుమార్, జగిత్యాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాంబాబు, కోరుట్ల ఆర్డిఓ ఆనంద్ కుమార్, కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ, కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, కోరుట్ల ఎంఈఓ నరేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఏకీన్పూర్ వార్డు ప్రజలు పాల్గొన్నారు.
.