తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు పట్టణంలో గల రెస్టారెంట్లు,స్వీట్ హోమ్ లు, బేకరీలు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి పరిశుభ్రత పాటించని, మరియు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడే యజమానులకు జరిమానాలు విధించడం జరిగింది.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ పట్టణంలోని స్వీట్ హోమ్ లు, బేకరీలు, హోటల్లు, రెస్టారెంట్లు నిర్వహించే యజమానులు రాబోయే వర్షాకాలంను దృష్టిలో ఉంచుకొని అంటూ వ్యాధులు ప్రబలకుండా, పరిశుభ్రతను పాటించాలని, నాణ్యమైన పరిశుభ్రమైన తాజా ఆహారాన్ని మాత్రమే ప్రజలకు విక్రయించాలని,మరియు సరైన నాణ్యత ప్రమాణాలను పాటించాలని తెలియజేయడం జరిగింది.
అంతేకాకుండా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు. లేనిపక్షంలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో జరిమానాలు విధించడంతోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఆయన తెలిపారు.
ఈ తనిఖీలలో సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఆకు అంజయ్య మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
.