ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ హరిజనవాడ, పాఠశాలలో, పోతాంగల్ మండలంలోని హైస్కూల్లోని ఎంపీసీఎస్ పాఠశాలలో ఏకరూప దుస్తులను, పాఠ్యపుస్తకాలను ఎంపిపి వల్లేపల్లి సునీత శ్రీనివాస్ పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాల ప్రారంభం నాడే దుస్తులను, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎంపీపీ సునీత  మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంతో పాఠశాల  ప్రారంభం నాడే ఏక రూప దుస్తులను, పాఠశాల  విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం పట్ల విద్యార్థి, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ డిసిసి డెలిగేట్ కొట్టం మనోహర్,డిసిసి ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్, ఎంపీటీసీ కేశ వీరేశం అధికారులు... పోతాంగల్ ఎమ్మార్వో మల్లయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, హై స్కూల్ హెచ్ఎం. శ్రీనివాసరావు, ఐకెపి ఎపిఎం బస్వంతరావు, ఎంపీఓ మారుతి, సిసి విట్టల్,ఆర్ఐ.సయ్యద్, ఈవో చంద్రకాంత్, సిఆర్పిఎస్ రాజేష్, రమేష్,ఈర్వంత్ రావు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు కమ్మరి గాయత్రి, కన్నం శ్రీనివాస్, సాయిలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

.