షాపూర్ నగర్ పాదచారుల వంతెన వెంటనే ప్రారంభించాలి : బిజెపి నాయకులు కేశవ యాదవ్

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) షాపూర్ నగర్ లో పాదచారుల బ్రిడ్జి నిర్మాణం పూర్తయి చాలా రోజులు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోవడం లేదని బిజెపి నాయకులు కేశవ్ యాదవ్ అన్నారు. ఇప్పటికైనా ఈ బ్రిడ్జిని పాలచారులకు అందుబాటులోకి తీసుకురావాలని సర్కిల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఇకనైనా అధికారులు స్పందించి బ్రిడ్జిని ప్రారంభించాలని లేకపోతే బిజెపి ఆధ్వర్యంలోని ప్రారంభిస్తామన్నారు. 

ఈ కార్యక్రమంలో జీడిమెట్ల అధ్యక్షులు బలరాం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రంగంపేట, అసెంబ్లి కన్వీనర్ సాయి జేవంత్, జాయింట్ కన్వీనర్ చంద్రశేఖర్, నిజాంపేట్ కన్వీనర్ సురేష్, కో కన్వీనర్ నాగరాజు, గుట్ట కన్వీనర్ రాము, చింతల్ కన్వీనర్ ప్రశాంత్, జూల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

.