తెలంగాణ ప్రభ, (కోరుట్ల): నేషనల్ హకర్ ఫెడరేషన్ పట్టణ అధ్యక్షుడు షహీద్ మొహమ్మద్ షేక్ డిమాండ్. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ పరిధిలో టై బజార్ ను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు
బుధవారం సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా కోరుట్ల మున్సిపల్ అధికారులు తైబజార్ టెండరు నిర్వహిస్తూ, చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారని వారు ఆరోపించారు
గత ఏప్రిల్ మాసంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు తీర్పు రాకముందే వసూళ్లకు దిగడం బాధాకరమన్నారు
ఇకనైనా ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ తీసుకొని కోర్టు తీర్పు వచ్చేవరకు వసూలు నిలిపివేసి చిరు వ్యాపారులకు ఆదుకోవాలని వారు కోరారు
ఎవరైనా ఒత్తిడి చేస్తే ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని వారు అన్నారు ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు అబ్ధుల్ ముసవ్విర్, మారు హనుమక్క,బాలక్క, అందే లక్ష్మి, మల్లవ్వ, అలువాల లక్ష్మి, గంగాధర్, ముజిబ్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు
.