మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి. ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా....

తెలంగాణ ప్రభ (కోటగిరి): తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏ.ఐ.టి.యు.సి. ఆధ్వర్యంలో బాన్సువాడ ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమమం సందర్భంగా  ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ.... వంట కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ మెస్ బిల్లులను వెంటనే చెల్లించాలని,  వివిధ  పాఠశాలలో  మౌలిక సదుపాయాలను కల్పించాలని,  అయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు 10వేల రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని ఆయన ఆర్డీవో కోరారు. వంట సరుకులను గ్యాస్ కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని,  స్లాబ్ రేటును 25 రూపాయలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎండి. ముస్తఫా, నీలాబాయి, స్వరూప, మల్లమ్మ,  సాయన్న జయన, సుంకు బాయ్  తదితరులు పాల్గొన్నారు.

.