తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కు అవార్డు పంపిణి జూన్ 05 "ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని" పురస్కరించుకొని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అవార్డులు ప్రధానం చేయడం జరిగినది.
ఇట్టి అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా కోరుట్ల పురపాలక సంఘం TGPCB గ్రీన్ చాంపియన్ అవార్డుకు ఎంపిక కాబడినది.
ఇట్టి అవార్డును హైదరాబాద్ లో శ్రీమతి A. వాణీ ప్రసాద్, IAS, ప్రిన్సిపల్ సెక్రెటరీ, EFST Dept. చేతుల మీదుగా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ శ్రీ బి. తిరుపతి అందుకున్నందుకుగాను ఈరోజు కోరుట్ల మున్సిపల్ ఆఫీస్ నందు మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ని మరియు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గోనెల మహేష్ ను మున్సిపల్ సిబ్బంది శాలువాతో సన్మానించడం జరిగింది.
.