తెలంగాణ ప్రభ. (కోటగిరి): బోధన్ లోని ఈవెంట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఉద్యోగ పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో గత 39 సంవత్సరాలుగా ఉద్యోగరీతిలో ఉంటూ అంకిత భావంతో పనిచేసి సేవలను అందించి అందరి మన్ననలు పొందిన వ్యక్తి మందుగుల విద్యాసాగర్ నేడు పంచాయతీరాజ్ విభాగం నుండి మంగళవారం ఉద్యోగ పదవి నుండి విరమణ పొందిన శుభ సందర్భంగా మందుగుల విద్య సాగర్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు గోపు సాయిలు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యాసాగర్ దంపతుల ఫోటోను వారి గుర్తుగా ఆయనకు బహుకరించారు. వారు మాట్లాడుతూ.... విద్యాసాగర్ దంపతులు సుఖసంతోషాలతో నిండు నూరేళ్లతో వారి కుటుంబ సభ్యులతో జీవితం సంతోషంగా గడపాలని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ గోపు సాయిలు, జిల్లా ఉపాధ్యక్షులు దేగం సాయిలు, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి నాగేశం, ఎమ్మార్పీఎస్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
