అంగన్వాడి సెంటర్ లో గర్భవతులకు శ్రీమంతం

తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండలంలోని చేత నగర్ అంగన్వాడి కేంద్రంలో గర్భవతులకు అంగన్వాడి సూపర్వైజర్ మనీ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లతో కలిసి గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ  శ్రీమంతం కార్యక్రమం సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ మనీ మాట్లాడుతూ...ఉమ్మడి మండలంలోని ప్రతి అంగన్వాడి కేంద్రాలలో గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. గర్భవతికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని గర్భవతులకు సూచించారు. ప్రతి నెలలో గర్భవతి 4 ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అంగన్వాడి కేంద్రాలలో పాలు గుడ్డుతో పాటు  భోజనాన్ని సెంటర్ నందు   గర్భవతులకు  తినే విధంగా ప్రోత్సహించి తినిపియ్యాలని అంగన్వాడీ టీచర్ కు ఆదేశించారు. గర్భవతులకు ఆకుకూరలు కూరగాయలు, మునగ తోటకూర పాలకూర ఎక్కువగా   తిన్నచో రక్తహీనతను నివారించవచ్చు అన్నారు. టీటీ ఇంజక్షన్ లు గర్భవతులు  తప్పకుండా తీసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు దుర్పత బాయి, రాజ్యలక్ష్మి ,కళావతి, ఏఎన్ఎం సవిత, ఆశ కార్యకర్త రేష్మ బేగం, అంగన్వాడి ఆయమ్మ డి. నవీన పిల్లల తల్లులు, కిశోర బాలికలు, బాలింతలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

.