తెలంగాణ ప్రభ (కోటగిరి): బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి విదేశీ( అమెరికా) పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి వచ్చిన శుభ సందర్భంగా ఆయనకు
హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో పోతంగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాజీ జెడ్పిటిసి పుప్పాల శంకర్ ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఏనుగు రవీందర్ రెడ్డికి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నవారు డిసిసి ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్, కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షాహిద్, గంధపురాజు చాంద్ పాషా, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.