ప్రెస్ క్లబ్ అధ్యక్షుని జన్మదినం సందర్భంగా అన్నదానం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్ర శేఖర్ జన్మదినం సందర్భంగా పట్టణ పాత్రికేయుల ఆధ్వర్యంలో కోరుట్ల సేవాదళ్ సహకారంతో పట్టణంలోని నిరుపేద చిన్నారులకు ఒకపూట భోజనం పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు గంగుల రాంగోపాల్,మహమ్మద్ సాజిద్ అలీ,సలావుద్దీన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు జానిల్,కిషన్,సేవాదళ్ అధ్యక్షులు పుప్పాల నాగరాజు,సభ్యులు మనోజ్,బన్నీ,ఆకాశ్,శ్రీజన్, తదితరులు పాల్గొన్నారు.

.