కోరుట్లలో చెత్తను సక్రమంగా సేకరించాలి .. మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల మున్సిపల్ ఆఫీస్ లో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో విధులు నిర్వర్తించే ఆటో డ్రైవర్లకు మీటింగ్ నిర్వహించి, ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్తను కలెక్షన్ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించడం జరిగింది . రానున్న వర్షాకాలంను  దృష్టిలో ఉంచుకొని చెత్తను ప్రతి ఇంటినుంచి సక్రమంగా సేకరించాలని, లేనియెడల అంటూ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వారిని హెచ్చరించడం జరిగింది. వార్డు ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని తెలపడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ డ్రైవర్లు పాల్గొనడం జరిగింది.

.