శ్రమించే శ్రామికుడు వెలుగు నింపే సేవకుడు.. రక్తంతో గీసిన చిత్రపటం బహుకరణ

తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): సాధారణంగా ఎవరిదైనా జన్మదినం సందర్భంగా మనం పూలదండ తో లేక కేకు అలా కాకుంటే శాల్వా తో సత్కరిస్తము అభిమానంతో శుభాకాంక్షలు తెలుపుతాము కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని,రహీంఖాన్ పేట

గ్రామానికి చెందిన  వ్యక్తి ఏకంగా తన రక్తంతో గీసిన చిత్రపటాన్ని తన అభిమాన నాయకుని జన్మదిన సందర్భంగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని

రహీంఖాన్ పేట,గ్రామానికి చెందిన అంతగిరి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ,అభిమాని ,మండల యువజన విభాగం ఉపాధ్యక్షులు కాగా సోమవారం తమ అభిమాన నాయకుడు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినము సందర్భంగా అందరిలాగా కాకుండా కొంచెం ప్రత్యేకంగా ఆలోచించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన శరీరంలో నుంచి రక్తాన్ని తీసి తన అభిమాన నాయకుని చిత్రపటము గీసి తమ నాయకుని జన్మదినము రోజున అతనికి అందించాడు. ఇంతటి ప్రేమ అభిమానం చూపించడం పట్ల తమ నాయకుడు పార్టీ కార్యకర్తలు అంతగిరి శ్రీనివాసులు అభినందించారు ఈ కార్యక్రమంలో తమ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

.