తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ మున్సిపల్ విలీన గ్రామమైన యకిన్ పూర్ గ్రామంలో ఆదివారం శ్రీ పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ పెద్దమ్మ తల్లికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించి గ్రామంలోని ముదిరాజ్ కుటుంబ సభ్యులందరూ ప్రతి ఇంటి నుండి ఒక బోనం వండి అమ్మవారికి గ్రామం నుండి ఊరేగింపుగా ఊరి చివరలో ఉన్న పెద్దమ్మ ఆలయం వరకు డబ్బు చప్పుల్లతో ద్యావతి వారి విన్యాసాలతో ర్యాలీగా పెద్దమ్మ ఆలయం వరకు చేరుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారికి బెల్లం శాఖతో తయారుచేసిన నైవేద్యం తో మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, కుటుంబ సభ్యులతో పాటు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
.