కోరుట్లలో ఘనంగా జువ్వాడి నర్సింగరావు పెళ్లిరోజు వేడుకలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు రజని దంపతుల వివాహ వార్షికోత్సవo సందర్భంగా ఈరోజు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జువ్వాడి భవన్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. 

సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ, మ్యాకల నర్సయ్య, ఎంబేరి సత్యనారాయణ,  రిజ్వాన్, ముల్క ప్రసాద్, గుంటుక రాజు, తెడ్డు విజయ్, ఏ ఆర్ అక్బర్, తుపాకుల బాజన్న, గంగధారి రమేష్, గంగధారి చంద్రశేఖర్, చిట్యాల సందీప్, పిన్నంశెట్టి మధుసూదన్,  మాజీ సర్పంచ్ పూదరి నరసయ్య, ప్రసాద్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం పట్టణంలోని నిరాశ్రయులకు కాంగ్రెస్ నాయకులు చిట్ మెల్లి రంజిత్ గుప్తా ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.

.