వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డి.ఎం.హెచ్.ఓ. తుకారం వెల్లడి.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని పి. హెచ్.సి. పోతంగల్, కోటగిరి సిహెచ్సి ఆసుపత్రులను  జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్ తుకారం  ఆకస్మితంగా సందర్శించి, తనిఖీ నిర్వహించారు. ఉమ్మడి మండలాలలోని ఆసుపత్రులలో  సిబ్బందితో  పలు సూచనలు చేశారు. వర్ష కాలం రావడంతో ఆరోగ్య   సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆస్పత్రిలోని సిబ్బంది  హాజరు పట్టిక, వాక్సిన్ భద్రపరిచే ఫ్రీజ్ ను  పరిశీలించారు. కుక్క కాటుకు, పాము కాటుకు ఇంజక్షన్ అందుబాటులో  ఉంచాలని ఆస్పత్రి  సిబ్బందికి ఆదేశించారు .హెల్త్ వెల్ నెస్ సెంటర్ లో అన్ని సేవలు అందచేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివర్లను  పెంచాలని సూచించారు, డెలివరీ ఉన్న వారి వివరాలు అందుబాటులో ఉంచి ప్రతి నిత్యం మానిటర్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  వైద్యాధికారి డాక్టర్ సుప్రియ, పి హెచ్ సి  వైద్యాధికారి డాక్టర్ కరణ్,ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్, సూపర్ వైసర్ జ్యోతి,సాయికుమారి, ఫార్మసిస్ట్, ఎం. ఎల్ .హెచ్. హిమాంజలి, పి.హెచ్ .సి, 

సి.హెచ్ ,సి.  సిబ్బంది ఆశ కార్యకర్త అరుణ పాల్గొన్నారు.

.