నిరుపేదలకు, గర్భిణీ స్త్రీలకు సేవ చేయాలనే "ఆశ"...

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన "ఆశ వర్కర్లు" ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి దుండిగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిహెచ్ఎంసి పరిధిలోని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని గర్భిణీ స్త్రీలకు ప్రసూతి నిర్వహించాలంటే నగరంలోని నీలోఫర్ వంటి ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుందని, ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో రాత్రిపూట గర్భిణీ స్త్రీలకు ప్రసవం నిర్వహించడం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి ఎన్నో అవస్థలు పడుతున్నామన్నారు. ఇప్పటికే గాగిల్లపూర్, దుందిగల్ ప్రాంతాల్లో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని వీటిలో ఒకదానిని జిహెచ్ఎంసీ పరిధిలోకి మారిస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ ప్రాంతంలోని ప్రాంతంలోని గర్భిణీ మహిళల ప్రసవాల కోసం మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి ప్రత్యేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేనందున సుదూర దూరాలకు వెళ్లాల్సి వస్తుందని, అదే జిహెచ్ఎంసీ పరిధిలో అరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే గర్భిణీ స్త్రీలతో పాటు ఆశా వర్కర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 

దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద  మాట్లాడుతూ నిరుపేదలకు, గర్భిణీ స్త్రీల కోసం ఎంతో ఉపయోగపడే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానన్నారు.

.