బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్...
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): మియాపూర్ ఎక్స్ రోడ్ పరిధిలోని "పల్కో సెక్యూరిటీస్ ఆఫీస్ " ఫీల్డ్ ఆఫీసర్ ప్రతాప్ గా గత కొన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నా.సెక్యూరిటీ కార్మికుడు.ప్రతాప్ ఫీల్డ్ ఆఫీసర్ కొన్ని అనువార్య కారణాలవల్ల డ్యూటీ మానేయడం జరిగింది.సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ ప్రతాప్ కు రావలసిన గత మార్చ్, ఏప్రిల్ గత రెండు నెలల వేత్తనం ఇవ్వాల్సి ఉండగా పల్కో సెక్యూరిటీ ఆఫీస్, వేత్తనం ఇవ్వకుండా దుర్భాషలాడి ఫీల్డ్ ఆఫీసర్ ప్రతాప్ ను బెదిరించి పంపించేవాడు. ఆ సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే మనకు న్యాయం చేస్తారో అని తోటి మిత్రులు ద్వారా తెలుసుకొని, బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ కార్యాలయం వద్దకు వెళ్లి సెక్యూరిటీ ప్రతాప్ ఫీల్డ్ ఆఫీసర్ కి జరిగిన అన్యాయం గురించి చెప్పారు, ఆ తర్వాత వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవిసింగ్ హుటాహుటిన సెక్యూరిటీ పాల్కో సెక్యూరిటీస్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ కు మార్చ్, ఏప్రిల్, రెండు నెలల వేత్తనం రావాల్సి ఉండగా వెంటనే మాట్లాడి, సెక్యూరిటీ ప్రతాప్ ఫీల్డ్ ఆఫీసర్ కు రావాల్సిన వేత్తనం ఇప్పించడం జరిగింది.ప్రతాప్ ఫీల్డ్ ఆఫీసర్ మాట్లాడుతూ నాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవిసింగ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు..
