తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని సంజీవని హాస్పటల్ ను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పి.హెచ్.సి. డాక్టర్ కరణ్ మండల ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్ సందర్శించి తనిఖీ నిర్వహించారు. గ్రామాలలోని ఆర్ఎంపి,పిఏంపి క్లినిక్స్ తనిఖీలో భాగంగా సంజీవని హాస్పిటల్ తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. హాస్పిటల్ పరిసరాలను హాస్పిటల్ లోని వైద్యుల వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని డాక్టర్ కరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జ్యోతి, ఏఎన్ఎం శ్రీదేవి, ఆశ వర్కర్ అనిత, బర్ల మధు సంజీవని హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
