అక్రమంగా ఈత చెట్లను తొలగిస్తే సహించేదే లేదు... టిజి గీత పని వాళ్ళ సంఘ కార్యదర్శి ఏ. విట్టల్ గౌడ్ డిమాండ్.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల  పరిధిలోని లింగాపూర్  గ్రామంలో చెరువుకట్టకు ఆనుకొని ఉన్న ఈత చెట్లను అక్రమంగా రైతు  జెసిబి ద్వారా చెట్లను తొలగించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర గీత పని వాళ్ళ సంఘం రాష్ట్ర కార్యదర్శి విట్టల్ గౌడ్,  గీత కార్మికుల  బృందం  వెంటనే స్పందించి ఈత చెట్లను  తొలగిస్తున్న  జెసిబిని అడ్డుకొని చెట్లను తొలగించడం నిలిపివేశారు. ఎక్సైజ్ నిబంధన ప్రకారం ఈత చెట్టును తొలగించాలంటే ఎక్సైజ్ అధికారుల ద్వారా అనుమతులు తీసుకొని ఉండాలన్నారు.లేనియెడల   ఈత చెట్టు తొలగించిన వారిపై పీడియాట్ చట్టం ద్వారా కేసు నమోదు అవుతుందని తెలిపారు. గీత కార్మికులకు ఈత చెట్లే వారి కుటుంబ పోషణ అని  గుర్తు చేశారు. రైతులకు వ్యవసాయం జీవనాధారం  ఎట్లనో, గీతా కార్మికులకు ఈత చెట్లు జీవనాధారం అని అన్నారు. రైతులు ఎవరైనా ఈత చెట్లను తొలగించాలంటే ఎక్సైజ్ నిబంధన ప్రకారం అనుమతులు పొందాలి తప్ప ఈత చెట్లను   అక్రమంగా తొలగిస్తే సహించేదే లేదని తెలంగాణ రాష్ట్ర గీత పని వారల సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. ఎక్సైజ్ అధికారులు ఇప్పటికైనా స్పందించి తొలగించిన ఈత చెట్లపై పంచనామ చేసి గీత కార్మికులకుటుంబాలకు న్యాయం చేయలన్నారు. లేనియెడల దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం మండల అధ్యక్షులు బి. వెంక గౌడ్ కార్యదర్శి శ్రీధర్ గౌడ్ సహాయ కార్యదర్శి పండరి గౌడ్ ఉపాధ్యక్షులు యాదగిరి గౌడ్  గీత కార్మికులు రాజా గౌడ్, శ్రీకాంత్ గౌడ్ మొగులా గౌడ్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

.