20 ఏళ్లకు వారంతా ఒకటైయి కలిశారు... ఘనంగా అపూర్వ సమ్మేళనం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల డిగ్రీ కళాశాలలో 2004 నుంచి 2007  వరకు డిగ్రీ చదువుకున్న విద్యార్థులు 20 ఏళ్ల తరువాత అదే కళాశాలలో మళ్లీ కలుసుకున్నారు.

ముందుగా సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం తమతో చదువుకున్న విద్యార్తుల అకాల మృతి చెందిన వారికి నివాళులర్పించారు.

అప్పటి మధుర జ్ఞాపకాలతో ఉల్లాసంగా గడిపారు.ఆడి పాడారు. ఆనాటి మధుర స్మృతులను తలుచుకుంటూ,ఆత్మీయ ఆలింగనాలు,కమనీయ కరచాలనాల మధ్య ఆట పాటలతో సందడి చేశారు. అప్పటి గురువులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. 

ఈ  కార్యక్రమంలో అప్పటి గురువులు వెంకన్న,తిరుపతి, వీరేశం విద్యార్థులు మన్నెగూడెం రమేష్,దీకొండ రాజు,సురేష్,మొహమ్మద్ అలీబాయ్, బర్ల అనిల్,కరికే రాజేష్,నక్క రమేష్, మిమిక్రీ బాస రవి,పీసు తిరుపతి రెడ్డి, ఆకుల రవి,సంతోష్ చారి,గణేష్,మధు,నర్సింహారెడ్డి, పద్మ,మమత,సంతోషిని, రమ్య,నాగరత్న,వాసవి,దీప తదితరులు పాల్గొన్నారు.

.