పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన జువ్వాడి కృష్ణారావు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): గత నెల 13న జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడగా, కోరుట్ల సెగ్మెంట్ ఫలితాలపై సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్ లో  కోరుట్ల మండల స్థాయి కార్యకర్తలు వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు పార్టీలో వివిధ హోదాలో ఉన్న నాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గంలో పోటీ చేసిన ధర్మపురి అరవింద్ ఆ ఎన్నికలలో తాను డబ్బులు పంపిణీ చేయక ఓడిపోయానని ఎన్నికల అనంతరం ప్రకటించారని మరి ఈరోజు ఎన్ని డబ్బులు పంపిణీ చేసి గెలిచాడు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు కోరుట్ల శాసనసభ్యుడు ఆరుమాసాల కింద ఎన్నికై ఈరోజు నియోజకవర్గంలో తన పార్టీని మూడవ స్థానానికి దిగజార్చుకున్నాడని, బిజెపితో టిఆర్ఎస్ పార్టీ కుదుర్చుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ బిజెపికి ఓట్లు వేయించి, ధర్మపురి అరవింద్ గెలుపుకు కారణమయ్యారని ఆయన అన్నారు 

జీవన్ రెడ్డి లాంటి మంచి నాయకుడు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది అని తాము భావించామని అన్నారు 

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని మునుముందు మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని కార్యకర్తలు ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం,  జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గడ్డం వెంకటేష్, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు కృష్ణారెడ్డి,  జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్ గౌడ్, కేడీసీసీ మాజీ డైరెక్టర్ నాగనూరి గంగాధర్ గౌడ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ రామచంద్ర రావు, మాజీ సర్పంచులు నరసయ్య, రమేష్, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ముక్కెర లింబాద్రి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాదిక్,  మాజీ ఉపసర్పంచ్ రంజిత్ రెడ్డి, ధనని లక్ష్మణ్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులు పార్టీలోని వివిధ హోదాలలో ఉన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

.